TG: పోలీసు శాఖలో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి సుమారు 17 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,369 మంది పోలీసులు పనిచేస్తుండగా, మంజూరైన పోస్టులు 95,361 ఉన్నాయి. ప్రతి ఏటా వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి భర్తీకి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికను పంపించినట్లు సమాచారం.