సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగటాపల్లి, మాచురామి, దర్శినమల, మల్లినేపల్లి గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపారు. నేరాల నియంత్రణ, ప్రజల రక్షణే లక్ష్యంగా ఈ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సహాయం చేసిన గ్రామస్తులకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.