చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం అఫ్గాన్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. అయితే, ఇటీవలే IPL పూర్తి చేసుకొని అంతలోనే టెస్టు ఫార్మాట్‌కు మారడం అంత తేలిక కాదని అతడు చెప్పాడు. తక్కువ సమయంలో ఫార్మాట్లు మారాలంటే అందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాలని తెలిపాడు. కాగా, జూన్ 6 నుంచి అఫ్గాన్‌తో ఏకైక టెస్టు ప్రారంభం కానుంది.