AKP: వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవో చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల ప్రగతిపై గురువారం కోటవురట్ల ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న జలధార జలహారతి పనుల్లో కూలీలు ఎక్కువమంది పాల్గొనే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు.