ATP: జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటాలని, 13 లక్షల విత్తనపు బంతులు చల్లాలని డివిజనల్ అటవీ శాఖాధికారి ఎం.గురుప్రభాకర్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9.39 శాతం పచ్చదనాన్ని 2030 నాటికి మరింత పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.