KDP: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా జూన్ 9న కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఆర్ఎస్పి రాష్ట్ర కన్వీనర్ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. వామపక్షాలు జూన్ 9 ఆందోళనకు అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.