VZM: ఇసుక అక్రమ రవాణాపై బొబ్బిలి పోలీసులు, రెవెన్యూ అదికారులు శుక్రవారం కొరడా ఝులిపించారు. ఈ మేరకు స్దానిక వేగవతినది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో RI కొల్లి రాంకుమార్ దాడి చేసి 6 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ తవ్వాకాలపై సమాచారం ముఖ్యమన్నారు.