NDL: ప్యాపిలి మండలంలోని 13,190 మంది రైతు కుటుంబాలకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రూ.7.68 కోట్ల ఆర్థిక సాయం అందనున్నట్లు మండల వ్యవసాయ అధికారి రాజేష్ తెలిపారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిధులు విడుదల చేయనున్నారన్నారు. ఈ సాయం రైతుల పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయానికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.