TPT: చిన్నగొట్టిగల్లు మండలం రంగ స్వర్గరిగడ్డ గ్రామంలోని శ్రీ కోల్లాపురమ్మ ఆలయ ప్రాంగణంలో రేపు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.