ADB: జిల్లాలోని యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈనెల 14వ తేదీన ఆదిలాబాద్లో ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సృజనాత్మక ఆలోచనలు ఉన్న వారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.