RR: ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లకు ప్రభుత్వం నిర్ణయించిన స్టైఫండ్‌ను ఇవ్వకుండా యాజమాన్యాలు మోసం చేస్తున్నాయని విద్యార్థి, యువజన సంఘాలు ఆరోపించాయి. ఈ దోపిడీని అరికట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు నిన్న వినతి పత్రం సమర్పించారు.