KKD: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సామర్లకోట మండలం హుస్సేన్ పురంలో శనివారం రాత్రి పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని SI మూర్తి కోరారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.