AKP: రోలుగుంట మండలంలో ఆదివారం ‘ఉల్లాస్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విఎస్.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా 4,014 మంది వయోజనులను గుర్తించి 24 పంచాయతీల్లో కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపీపీ, అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చదవడం, రాయడంపై ప్రత్యేక శిక్షణ అందిస్తామని అయన వెల్లడించారు.