ATP: కర్ణాటకలోని హంపిలో జరిగే ఉత్సవాల లాగా గుత్తి కోట ఉత్సవాలు జరగడం చాలా ఆనందంగా ఉందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గుత్తి కోట ఉత్సవాల గురించి మన జిల్లా ఎంపీ లక్ష్మీనారాయణ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడారని వారు పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ గుత్తి కోట చరిత్ర తెలిపేందుకు ఇలాంటి ఉత్సవాలు మరెన్నో జరగాలన్నారు.