కోనసీమ: జిల్లాలో కోడి మాంసం ధరలు భారీగా పెరిగాయి. అమలాపురం మార్కెట్లో బ్రాయిలర్ చికెన్ కిలో రూ.300, ఫారం మాంసం కిలో రూ.240 అమ్ముతున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. మటన్ కిలో రూ.800కి అమ్ముతున్నారు. చేపల రకాన్ని బట్టి రూ.130 నుంచి 160 వరకు అమ్ముతున్నారు. కోళ్లు సరఫరా తగ్గడం వల్ల ధరలు పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారస్తులు అంటున్నారు.