MDK: తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం సర్పంచ్ యాంజాల స్వామి ఆధ్వర్యంలో యువత స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. యావపూర్ గ్రామంలోని 9వ వార్డులో వీధులను శుభ్రం చేసి చెత్తను తొలగించారు. యావపూర్ గ్రామంలో ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను లేకుండా చూసుకోవాలని సూచించారు.