MNCL: బెల్లంపల్లి పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలకు ఎలాంటి ఆస్కారం లేదని తహాసీల్దార్ కృష్ణ తెలిపారు. ఇప్పటికే 491 మంది అర్హుల జాబితాను విడుదల చేశామని, డ్రాతో 108 మంది లబ్ధిదారులను నిర్ణయిస్తామన్నారు. ఇందులో పైరవీలు ఉండవు. ప్రక్రియ అంతా పారదర్శకంగా కొనసాగిస్తామని తెలిపారు. దళారులు డబ్బులు డిమాండ్ చేస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.