సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రత ప్రజల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో వాహనాల తనిఖీలు చేసి, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు.