PDPL: ధర్మారం మండలంలో ఈనెల 14 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంఈవో ప్రభాకర్ తెలిపారు. ఇవాళ ఆయన పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. మండలంలో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాలు ముందు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.