PLD: కోటప్పకొండ దేవస్థానంలో ప్రసాదం నాణ్యతపై వస్తున్న కథనాలు అవాస్తవమని దేవస్థానం ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదం నాణ్యత ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రసాదం తయారీకి అవసరమైన పదార్థాలను మంచి నాణ్యతతో కొనుగోలు చేస్తున్నామన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో స్వామివారికి నైవేద్యం తయారు చేస్తున్నామన్నారు.