TG: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ బోధించే రాజ్యాంగ నైతికత ఇదేనా? అని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. ఫిరాయింపుల నిరోధకచట్టాన్ని అవకాశవాదం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. తమ పార్టీలో గెలిచిన నాయకులను కాంగ్రెస్లో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వారితో వెంటనే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు.