తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర గ్యాస్ కొరత నెలకొంది. గృహ సిలిండర్లనే గ్యాస్ ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయి. గ్యాస్ కొరత నేపథ్యంలో ఏజెన్సీల దగ్గర వినియోగదారులు క్యూలు కడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. గ్యాస్ కష్టాలు కొనసాగితే నష్టపోతామని యజమానులు అంటున్నారు.