డిఫెండింగ్ ఛాంపియన్ RCB తరఫున రెండో టైటిల్ గెలించేందుకు IPL 2026లో కోహ్లీ ధాటిగా ఆడతాడని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. కోహ్లీకి పరుగుల దాహం గతంలో కంటే ఎక్కువగా ఉందని, నిజానికి IPL 2025 విజయంతో అది మరింత పెరిగిందన్నాడు. SA, NZ వన్డే సరీసుల్లో రాణించిన మాదిరే.. ఈ IPL సీజన్ ప్రతి మ్యాచులోనూ తనదైన ముద్ర వేసేందుకు విజృంభించి ఆడతాడని చెప్పుకొచ్చాడు.