NDL: కొలిమిగుండ్ల మండలంలో 160 HPV వ్యాక్సిన్లు మంజూరైనట్లు ప్రభుత్వ వైద్యులు డా.హరిచరణ్ రెడ్డి వెల్లడించారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం వీటిని అందిస్తోందన్నారు. 2011 ఫిబ్రవరి నుంచి 2012 మార్చి మధ్య జన్మించిన బాలికలకు మాత్రమే ఈ వ్యాక్సిన్లు వేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సుమారు 250 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.