మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కిన మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం జీ5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.