VSP: జీవీఎంసీ 20వ వార్డు పెదవాల్తేరు, చుట్టు పక్కల ప్రాంతాల్లో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. అన్ని వార్డుల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణను కఠినంగా పర్యవేక్షించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.