KMM: మధిరలో ఈ నెల 28 న జరగనున్న మొదటి మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మధిర కోర్టు న్యాయమూర్తి వేముల దీప్తి కోరారు. గురువారం స్థానిక ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన మెగా లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. లోక్ అదాలత్ విజయవంతానికి పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో పని పనిచేయాలన్నారు.