VZM: చీపురుపల్లిలో శుక్రవారం 6,012 మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందజేయనున్నట్లు AO సూర్యకుమారి గురువారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. PM కిసాన్ కింద రూ. 1.03 కోట్లు, రాష్ట్ర వాటా కింద రూ. 2.40 కోట్లు విడుదల కానున్నాయని తెలిపారు. స్థానిక MLA కిమిడి కళా వెంకటరావు చేతుల మీదుగా గరివిడిలో జరగనున్న కార్యక్రమంలో రైతులకు చెక్కులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.