ప్రకాశం: ఒంగోలు డిపోలో రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ ప్రారంభించనున్నట్లు పొదిలి డిపో మేనేజర్ శంకర్రావు తెలిపారు. డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కనీసం 18 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని, శిక్షణకు ఫీజు రూ. 20,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 16వ తేదీ లోపు డిపో మేనేజర్‌ను సంప్రదించాలన్నారు.