GNTR: జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు గురువారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ. 5,875 మద్దతు ధర ప్రకటించినా, మార్కెట్లో కేవలం రూ. 4,500 మాత్రమే ధర లభిస్తోందని వారు జేసీకి వివరించారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి రైతులకు న్యాయం చేయాలని కోరారు.