W.G: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం యల్.హెచ్.టౌన్ హాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.