KMM: అక్క మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయినా, తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైన ఓ విద్యార్థిని మనసును కదిలించే ఘటన మధిరలో చోటుచేసుకుంది. తీవ్ర మనోవేదన మధ్య కూడా ధైర్యంగా పరీక్ష రాసిన హాసిని పరిస్థితి అక్కడున్న వారందరినీ కదిలించింది. ఆమె పట్టుదల, ధైర్యాన్ని పలువురు నేడు అభినందించారు.