ADB: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని, అర్థమయ్యే రీతిలో భోదించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ అన్నారు. గురువారం నార్నూర్ మండలం గిరిజన ఆశ్రమ పాఠశాల మోడల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగారు.