KNRL: పత్తికొండలో గురువారం జరిగిన కార్యక్రమంలో శ్యామ కుమార్ 77 మంది లబ్ధిదారులకు రూ.49 లక్షల 70 వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హత ఆధారంగా ప్రభుత్వం నిధులు అందజేస్తోందని పేర్కొంటూ లబ్ధిదారులు వారికీ కృతజ్ఞతలు తెలిపారు.