WNP: కేవలం రెండేళ్లలో వనపర్తి ఆర్టీసీ డిపోకు దాదాపు రూ.10 కోట్ల పైనే ఆదాయం సమకూరిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గత BRS హయంలో దివాలా తీసిన ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలో కొనసాగుతుందన్నారు. వనపర్తి డిపోకు సంబంధించి రోజుకు రూ.4 లక్షలు ఉండే ఆర్టీసీ ఆదాయం నేడు రూ.30 నుంచి రూ.35 లక్షలకు పెరిగిందన్నారు.