KNR: తిమ్మాపూర్ మండలం నేదునూరులో ఆర్ఎంపీ తమ్మనవేణి కొమరయ్యపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి విధి నిర్వహణ ముగించుకుని వస్తుండగా, జెన్కో సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగి.. అకస్మాత్తుగా కొమరయ్య కళ్లలో కారంపొడి చల్లాడు. ఈ క్రమంలో కొమరయ్య వద్ద నుంచి 12 గ్రాముల బంగారు గొలుసు, నగదు ఎత్తుకెళ్లి మామిడి తోటలోకి పారిపోయాడు.