అనంతపురంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో RRB రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్-డీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంచాలకులు కొఠారి గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేసి 2 నెలల పాటు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.