KMM: కారేపల్లి మండల పరిధిలోని పాత కమలాపురం సర్పంచ్ బాబురావు మృతదేహానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ గురువారం నివాళి ఆర్పించారు. దహన సంస్కారల సందర్భంగా అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. సర్పంచ్ బాబురావు కుటుంబానికి తక్షణ సాయంగా రూ.50 వేలు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.