VKB: బంట్వారం మండలం నుంచి తోర్మామిడి వెళ్లే రోడ్డులో సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డు వెంబడి వాహనదారులు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. గుట్ట మీద నుంచి ఓవర్ స్పీడ్తో వచ్చిన చాలా మంది వాహనదారులు కింద పడ్డారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.