PLD: అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలో 2,40,530 మంది రైతులకు రూ. 135.48 కోట్ల ఆర్థిక సహాయం అందనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా గురువారం తెలిపారు. ఈ విడతలో రైతులకు రూ. 6,000ల చొప్పున జమ అవుతుందన్నారు. రైతులు ఈ నిధులను తదుపరి పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అవసరాలకు వినియోగించుకోవాలన్నారు.