శ్రీకాకుళంలో నివాసం ఉంటున్న మన్నేన పుష్పలత ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి దంపతులు గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈమేరకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమెతో పాటు పలువురు నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు.