కర్నూలు నగరపాలక సంస్థ ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేసింది. ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుల రద్దీ దృష్ట్యా కేంద్రాల పనివేళలను పొడిగించారు. ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు కేంద్రాలు పనిచేస్తాయని కమిషనర్ విశ్వనాథ్ శనివారం తెలిపారు. పన్నుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమీషనర్ సూచించారు.