అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 35 మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో సుమారు ఐదున్నర కోట్ల రూపాయల మేర సాయం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరం అన్నారు.