MDK: జొన్న పంటకు నీరు పెడుతుండగా పాము కాటుకు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. రేగోడ్ మండల కేంద్రానికి చెందిన కర్ణకోటి రాములు(55) గురువారం భార్యతో కలిసి పొలానికి నీరు పెడుతుండగా నాగుపాము కాటేసింది. మొదటి కాటు తర్వాత భార్యను పిలిచేలోపే అదే పాము మరోసారి కాటేసినట్లు సమాచారం. వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాములు మృతిచెందాడు.