SKLM: జిల్లా వ్యాప్తంగా గ్యాస్ బుకింగ్ సమస్య తలెత్తడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ సరిగా జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత వస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ప్రజల్లో భయం నెలకొంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.