NLG: మల్లేపల్లిలో వాణిజ్య అవసరాలకు వాడుతున్న 60 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను పౌర సరఫరా అధికారులు సీజ్ చేశారు. హోటళ్లు, దాబాలపై దాడులు నిర్వహించి 6A కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్.డి. ముబీన్, ఎండీ ముక్తార్, ఏ. దీపక్, ఆర్. సైదులు గౌడ్, జ్యోతి, ఏ. సైదులు, కుమార్ రెడ్డి మరియు టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.