AP: త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందించాలని ఆదేశించారు. దీపం 2.0 పథకానికి డిజిటల్ వోచర్ జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. డ్వాక్రా, మెప్మా సంఘాల సేవల్ని వినియోగించుకుని పీ4 సహా జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.