VZM: 2024 గరివిడి పోలీసు స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో బాల నేరస్థుడుకి పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించినట్లు ఎస్పీ గురువారం తెలిపారు. రూ. 12 వేలు జరిమానా, పరిహారం రూ. 5 లక్షలు ఇవ్వాలని తీర్పులో వెల్లడించారు. బొప్పడాం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని పెళ్లి పేరుతో మోసం చేసినట్లు చెప్పారు.