• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఉస్తాద్’ నటీనటుల రెమ్యూనరేషన్

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న రిలీజ్ కానుంది. పవన్ ఈ సినిమా కోసం కేవలం రూ.25 కోట్లు మాత్రమే తీసుకున్నారట. నిర్మాతలతో ఉన్న పాత అడ్వాన్స్‌ల సర్దుబాటు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. శ్రీలీలకు రూ.2.5-3 కోట్లు, రాశీ ఖన్నాకు దాదాపు రూ.1.5-2 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సుమారు రూ.120-150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారట.

March 18, 2026 / 10:26 AM IST

‘ఈనెల 31 తేదీలోపు ఇంటి పన్నులు చెల్లించండి’

NLR: బుచ్చి పట్టణంలోని ప్రజలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి, ఖాళీ స్థలం పన్నులు ఈనెల 31 తేదీలోపు చెల్లించాలని నగర కమిషనర్ బాలకృష్ణ ఓ ప్రకటనలు తెలిపారు. 31 తేదీీీీీీీీ లోపు చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.

March 18, 2026 / 10:25 AM IST

నేడే మండల సర్వసభ్య సమావేశం..!

KRNL: ఆదోని మండల పరిషత్ భవనంలో బుధవారం ఎంపీపీ దానమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO నాగరాజు స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ప్రధానంగా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలు, ఇతర అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

March 18, 2026 / 10:25 AM IST

గుడివాడలో మాజీ మంత్రి ఇంట్లో చోరీ

కృష్ణా: గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ నివాసంలో చోరీ జరిగింది. ఇంటి తాళం పగులకొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు వస్తువులను చిందర వందరగా చేశారు. హైదరాబాద్‌కు వెళ్లి ఇవాళ తిరిగి వచ్చిన ఆయన భార్య మధురిమ ఘటనను గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశపారంపర్యంగా ఉన్న సుమారు 10 కిలోల వెండి వస్తువులు, పూజా సామాగ్రి అపహరణకు గురైనట్లు తెలిపారు.

March 18, 2026 / 10:25 AM IST

పెదకూరపాడులో ట్రాఫిక్ కష్టాలు

PLD: పెదకూరపాడులోని ప్రియా హోటల్ సెంటర్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య తీవ్ర తరమవుతోంది. మంగళవారం సాయంత్రం మిర్చి టిక్కీలతో వెళ్తున్న ట్రాక్టర్లు ఒకేసారి ఎదురుకావడంతో బస్సులు, ఇతర వాహనాలు గంటల తరబడి నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని స్థానికులు వాపోతున్నారు.

March 18, 2026 / 10:25 AM IST

రైల్వే డిపో భూసేకరణపై హైకోర్టులో పిటిషన్

TG: శంషాబాద్‌లో రైల్వే మెగా కోచింగ్ డిపో కోసం భూసేకరణను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీవో 111 నిబంధనల ఉల్లంఘన, పర్యావరణ అనుమతులు లేకపోవడంపై పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరీవాహక ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు, దీనిపై స్పందించాలని అధికారులకు నోటీసులు జారీ చేసింది.

March 18, 2026 / 10:25 AM IST

నగరి ప్రజలకు గమనిక.. 50 శాతం వడ్డీ మాఫీ

CTR: మున్సిపాలిటీకి బకాయి ఉన్న పన్నుపై ప్రభుత్వం 50 శాతం మాఫీ ప్రకటించిందని నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజి నాయక్ తెలిపారు. ఈ నెల 31వ తేదీ లోపు చెల్లించవలసిన బకాయిలు మొత్తంలో ఒక్కసారిగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇప్పటికే వసూలు చేసిన వడ్డీ భవిష్యత్‌లో సర్దుబాటు చేస్తామన్నారు.

March 18, 2026 / 10:23 AM IST

అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయాలి: కౌశిక్ రెడ్డి

KNR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ డ్రగ్స్ మాత్రమే కాకుండా మద్యం పరీక్షలు కూడా నిర్వహించాలని సవాల్ విసిరారు. కేటీఆర్‌పై కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. అధికార దుర్వినియోగంపై ఆరోపణలు చేస్తూ విచారణ జరపాలన్నారు.

March 18, 2026 / 10:23 AM IST

అమరావతిలో గ్యాస్ కష్టాలు.. ఏజెన్సీ వద్ద బారులు

PLD: అమరావతిలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం వినియోగదారులు బారులు తీరారు. 2,3 రోజులుగా ఆన్‌లైన్ బుకింగ్ కాకపోవడంతో గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. నేరుగా ఏజెన్సీ వద్దకు వచ్చి ఆన్‌లైన్ చేయించుకుని సిలిండర్లు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వర్ బిజీ వల్ల కొంత జాప్యం జరుగుతోందని, ఆన్‌లైన్ విధానంలో ఎలాంటి సమస్య లేదన్నారు.

March 18, 2026 / 10:22 AM IST

టీమిండియా కెప్టెన్ దీపికకు ఐదు సెంట్ల ఇంటి స్థలం అందజేత

సత్యసాయి: భారత అంధ మహిళల టీ-20 క్రికెట్ కెప్టెన్ దీపికకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అండగా నిలిచారు. అమరాపురం మండలం తంబాలహట్టికి చెందిన దీపిక నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు హేమావతి గ్రామంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం కేటాయించారు. మంగళవారం దీపిక కుటుంబ సభ్యులకు స్థల పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యేకు దీపిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

March 18, 2026 / 10:22 AM IST

నిలిచిన వర్షపు నీరు.. విద్యార్థుల అవస్థలు

RR: షాద్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీలో గల ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిన నీటితో చిన్నారులు తరగతులకు వెళ్లడం కష్టంగా మారింది. పాఠశాల చుట్టూ సరైన కాలువ వ్యవస్థ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు సంబంధించిన అధికారులు స్పందించాలని కోరారు.

March 18, 2026 / 10:19 AM IST

ఉగాది వేడుకలకు దేవాలయాల ముస్తాబు

PDPL: తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలకు పలు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి సహా పలు గ్రామాల్లోని ఆలయాలు సర్వాంగ సుందరంగా మారుతున్నాయి. పోచమ్మ గుడిలో భక్తులకు తాగునీరు, సౌకర్యాల ఏర్పాట్లు చేశారు. పాలకవర్గాల తొలి ఉగాది కావడంతో ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారు. ఈ మేరకు ఆలయాల్లో అధికారులు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు.

March 18, 2026 / 10:19 AM IST

ప్రముఖ జర్నలిస్ట్‌కు ఉగాది పురస్కారం..!

W.G: నరసాపురం గడ్డపై జన్మించి, తెలుగు పత్రికా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ జర్నలిస్ట్, ఎడిటర్, కవి ఎం.సతీశ్ చంద్రకి ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం లభించింది. సాహిత్య, జర్నలిజం రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఆయన ఇప్పటి వరకు సుమారు 32 పుస్తకాలు రచించారు. ఈ సందర్బంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 18, 2026 / 10:18 AM IST

గాలి కుంటు వ్యాధి నివారణ టీకా

SKLM: సరుబుజ్జిలి తెలికి పెంట పంచాయతీలో పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ గోవిందరావు ఇవాళ ప్రారంభించారు. పశుసంవర్ధక రంగం రైతులకు అదనపు ఆదాయం అందించే ముఖ్యమైన వనరు అని అన్నారు. పశువులను వ్యాధుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న టీకా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 18, 2026 / 10:18 AM IST

వాహనాలకు రెడ్ సిగ్నల్ పడితే చిరుజల్లులు

AP: వేసవి ఎండల నుంచి వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు అనంతపురంలోని సప్తగిరి కూడలిలో ‘ఓపెన్ స్పేస్ కూలింగ్ సిస్టం’ ఏర్పాటు చేశారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు నీటి తుంపరల ద్వారా ఈ వ్యవస్థ చల్లదనాన్ని అందిస్తుంది. టీచర్ సురేష్ నాయక్ సూచనతో మున్సిపల్ అధికారులు రాష్ట్రంలోనే తొలిసారిగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ట్రయల్ రన్ కొనసాగుతోంది.

March 18, 2026 / 10:18 AM IST