• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పట్టణ సౌందర్యాన్ని దెబ్బతీసేలా రోడ్లపై చెత్త వేయకూడదు’

GDWL: వడ్డేపల్లి పట్టణాన్ని రోగాల బారి నుంచి రక్షించాలంటే పరిశుభ్రతే ఏకైక మార్గం అని మున్సిపల్ ఛైర్మన్ మంజుల ధర్మ పేర్కొన్నారు. బుధవారం తెలవరుజమున ప్రధాన రహదారులు, బజార్లలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న పనిని పరిశీలించారు. పట్టణ సౌందర్యాన్ని దెబ్బతీసేలా రోడ్లపై చెత్త వేయకూడదని, ప్రతి ఒక్కరూ మున్సిపల్ వాహనాలకే వ్యర్థాలను అందించాలన్నారు.

March 18, 2026 / 10:01 AM IST

‘ఇంటి పన్నులను 100 శాతం వసూలు చేయాలి’

JGL: ఇంటి పన్నులను 100 శాతం వసూలు చేయాలని, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటి పన్నులను 100 శాతం వసూలు చేయాలని, నర్సరీలో మిగిలిన పనులను పూర్తి చేయాలని ఆయన ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు.

March 18, 2026 / 10:01 AM IST

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

NLG: మాడుగులపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చెరువుపల్లి గ్రామానికి చెందిన పాలువాయి సుమలతతో పాటు మరో ఇద్దరు మహిళలకు తహసీల్దార్ సామల సరోజ పావని చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి పాల్గొన్నారు.

March 18, 2026 / 10:01 AM IST

మున్సిపల్ నల్లాల ద్వారా మురికి నీరు సరఫరా

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ పరిధి సాయి కాలనీ, శ్రీనివాస కాలనీలలో నల్లాల ద్వారా గత నాలుగు రోజులుగా అపరిశుభ్రమైన మంచినీరు సరఫరా అవుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా పాత పైపు లైన్ స్థానంలో ఏర్పాటు చేసిన కొత్త పైపు లైన్‌లో పేరుకుపోయిన మట్టితో కూడిన నీరు నల్లాల ద్వారా వస్తుండడంతో తాగలేని పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు.

March 18, 2026 / 10:01 AM IST

అప్పులభాద తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య

SDPT: దుబ్బాక మండలం రఘోతంపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన చిన్నారెడ్డి మోహన్ రెడ్డి అనే రైతు అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 18, 2026 / 10:00 AM IST

మండలంలో ఉచిత హెల్త్ కిట్ల పంపిణీ

VKB: పులిమామిడికి చెందిన సామాజికవేత్త రత్న మొల్ల రవీందర్ రెడ్డి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. నవాబుపేట్ మండలంలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) తో పాటు చించేల్‌పేట్, గంగ్యడ గ్రామాల్లో ఆయన స్వచ్ఛందంగా హెల్త్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో PHC డాక్టర్ రోహిత్, ANMలు, ఆశా వర్కర్లు పాల్గొని కిట్లను స్వీకరించారు.

March 18, 2026 / 10:00 AM IST

తిరుపతి ప్రజలకు గమనిక.. 50 శాతం ఆఫర్

TPT: తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య కార్పొరేషన్ పరిధిలో ప్రాపర్టీ టాక్స్, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై వడ్డీలో 50% మాఫీ ప్రకటించారు. ఆస్తి పన్ను బకాయిలు, ప్రస్తుత సంవత్సర టాక్స్ పాటు 50% వడ్డీ చెల్లిస్తే చాలని, మిగిలిన వడ్డీ మాఫీ అవుతుందన్నారు. వన్-టైమ్ పన్ను చెల్లింపు అవకాశం మే 31, 2026 వరకు మాత్రమే ఉందన్నారు.

March 18, 2026 / 09:59 AM IST

విద్యార్థులకు 7వ బెటాలియన్ పోలీసుల చేయూత

NZB: డిచ్‌పల్లిలోని మానవతా సదన్ విద్యార్థులకు 7వ బెటాలియన్ పోలీసులు చేయూతను అందించారు. బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ ఆదేశాల మేరకు యాన్యువల్ రిఫ్రెషర్ కోర్స్‌లో భాగంగా అధికారులు, సిబ్బంది మంగళవారం మానవతా సదన్‌ను సందర్శించారు. అక్కడి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు.

March 18, 2026 / 09:57 AM IST

‘హిస్టరీ రిపీట్ అయితే.. పాక్‌కే మంచిది కాదు’

కాబుల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ చేసిన దాడిలో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిపై అఫ్గాన్ యువ స్పిన్నర్ మొహమ్మద్ ఘజన్‌ఫర్ మండిపడ్డాడు. అఫ్గానిస్తాన్ చరిత్ర గురించి అందరికీ తెలుసని.. చరిత్ర పునరావృతమైతే అది పాకిస్తాన్‌కు మంచిది కాదని హెచ్చరించాడు. అలాగే, తమ మిత్ర దేశమైన భారత్‌తో ఈ విషయాన్ని చర్చించాలనుకుంటున్నట్లు తెలిపాడు.

March 18, 2026 / 09:56 AM IST

ఈ నెల 30వ తేదీన బార్ అసోసియేషన్ ఎన్నికలు

JN: జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి చంద్రరుషి తెలిపారు. 20వ తేదీ లోపు నామినేషన్ల స్వీకరణ,ఉపసంహరణ, 30వ తేదీన ఎన్నికలు, ఫలితాల ప్రకటన జరుగుతుందన్నారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.

March 18, 2026 / 09:54 AM IST

తమిళ దర్శకుడితో పవన్ సినిమా?

మార్చి 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఈ సినిమా తర్వాత పవన్ తమిళ దర్శకుడు మోహన్ రాజాతో ప్రాజెక్టు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పవన్‌కు ఆసక్తికరమైన కథను వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి మధ్య చర్చలు జరుగుతున్నాయట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించనున్నట్లు టాక్.

March 18, 2026 / 09:50 AM IST

BREAKING: తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి రూ.1,57,750కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,44,600గా ఉంది. ముఖ్యంగా వెండి ఏకంగా రూ.5,000 తగ్గి రూ.2,75,000 వద్దకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

March 18, 2026 / 09:49 AM IST

వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు

NGKL: అచ్చంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. వరుసగా పండుగలు, ఇతర కారణాల రీత్యా మార్చి 18 నుంచి మార్చి 21 వరకు మార్కెట్‌కు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. వరుసగా నాలుగు రోజుల పాటు మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. తిరిగి మార్చి 22 నుంచి క్రయ విక్రయాలు యథాతథంగా ప్రారంభమవుతాయని కమిటి తెలిపింది.

March 18, 2026 / 09:49 AM IST

ఘనంగా నూకాలమ్మ తల్లి పండగ

AKP: కోటవురట్ల మండలం తంగేడులో కొత్త అమావాస్య సందర్భంగా నూకాలమ్మతల్లి పండగను ఇవాళ ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు పలువురు ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.

March 18, 2026 / 09:49 AM IST

మాజీ సీఎంను కలిసిన వైసీపీ నేతలు..!

KRNL: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మిగనూరు మాజీ MLA చెన్నకేశవరెడ్డి, సీనియర్ నాయకులు, వైసీపీ ఇంఛార్జ్ రాజీవ్ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలను మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లాలని జగన్ మోహన్ రెడ్డి నాయకులకు సూచించారు. 

March 18, 2026 / 09:49 AM IST